రూ. లక్షా 38 వేలకు లడ్డును కైవసం చేసుకున్న గోపి

శివ్వంపేట సెప్టెంబర్ 11 జనంసాక్షి : మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల గ్రామంలో గ్రామస్తుల ఆనందోత్సవాల మధ్య శనివారం రాత్రి వినాయక నిమజ్జనం చేపట్టారు. రాత్రి 10 గంటల సమయంలో గ్రామ ప్రధాన కూడలి వద్ద నిర్వహించిన గణపతి లడ్డు వేలం పాటలో బిజెపి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి సింగయపల్లి గోపి  1,38,000 రూపాయల అత్యధిక పాట తో గణపతి లడ్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డు ను కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణరావు గోపి కుటుంబ సభ్యులు ఉన్నారు.