రూ. 15 లక్షల విలువైన గంజాయి పట్టివేత

విశాఖ: రోలుగుంట మండలం ఎంకేపట్నం వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.15 లక్షల విలువైన 330 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆటో, ద్విచక్రవాహనంలో తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి స్వాధినం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయగా 8 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు.