రూ.35వేలు మాత్రమే చెల్లిస్తాం

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కళాశాలల్లో బోధనా ఫీజు రూ.35వేలు మాత్రమే చెల్లిస్తామని మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. బోధనా ఫీజులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫీజు రూ.35వేలకు మించితే మిగిలిన అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. 46 కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీ తరువాత ఫీజు తగ్గే అవకాశముందని మంత్రి అన్నారు. 578 కళాశాలలు అంగీకరించిన రూ.35 వేల ఫీజును ప్రభుత్వమే భరిస్తుందని పితాని వెల్లడించారు.