రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌

రాజ్‌కోట్‌ : రాజ్‌కోట్‌ సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో ఇంగ్లండ్‌, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్‌ 172 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 145 పరుగుల వరకు వికెట్‌ కోల్పోకుండా నిలకడగా ఆడిన ఇంగ్లండ్‌ 158 పరుగుల వద్ద బెల్‌ (85) రన్‌ అవుట్‌ అవడంతో తొలివికెట్‌ను కోల్పోయింది. అనంతరం 172 పరుగుల వద్ద కుక్‌ (75) అవుటయ్యాడు. రహానే, రైనాలకు చెరో వికెట్‌ దక్కింది.