రెడ్యానాయక్‌ హత్యారాజకీయాలు మానుకోవాలి

మరిపెడ:మాజీ మంత్రి రెడ్యానాయక్‌ హత్యారాజకీయాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు కడియం శ్రీహరి హితవు పలికారు.బుధవారం వరంగల్‌ జిల్లా మరిపెడ మండలం తాళ్లవూకల్‌ గ్రామంలో హత్యకు గురైన తెదేపా కార్యకర్త రామన్న అంత్యక్రియలకు వారు హజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి రెడ్యానాయక్‌ ప్రొత్బలంతో తెదేపా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయాని అన్నారు.రామన్న హత్యను తీవ్రంగా ఖండించారు.రామన్న హత్య పోలీసుల వైఫల్యం కారణంగా జరిగిందన్నారు.మృతుడి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ తరపున లక్ష రూపాయలు డోర్నకల్‌ నియోజకవర్గ పార్టీ లక్ష రూపాయలు అందజేయడమే కాకుండా కుటుంబాన్ని ఆర్ధికంగా తెదుపా ఆదుకుంటుందని పేర్కొన్నారు.