రేపటి నుంచి పల్స్‌ పోలియో

23 వరకూ మొదటి విడత : మంత్రి డీఎల్‌

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమాన్ని 20 నుంచి నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో వివరించారు. 20 నుంచి 23 వరకూ మొదటి విడత పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుందన్నారు. తొలి రోజు నిర్దేశించిన పోలియో కేంద్రాల్లో, తర్వాతి రెండు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కులు వేస్తారన్నారు. తర్వాతి రెండు విడత ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు జరుగుతుందన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చ్కులు వేయించి వారి బంగారు జీవితాల్ని కాపాడాలని ఆయన సూచించారు. 2008 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని, భవిష్యత్తులో కూడా నమోదు కాలేదని, భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా కేసులు నమోదు కాకుండా కృషిచేయాలని ఆయన కోరారు.