రేపు,ఎల్లుండి దేశవ్యాప్తంగా న్యాయవాదుల సమ్మె

న్యూఢిల్లీ:న్యాయ విద్యా వ్యవస్థను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఉన్నత విద్య పరిశోధన బిల్లును నిరసిస్తూ న్యాయవాదులు రెండురోజుల సమ్మెకు దిగుతున్నారు.ప్రభుత్వ చర్యలకు నిరసనగా బుధ,గురు వారాల్లో దేశవ్యాప్తంగా న్యాయవాదులు సమ్మె చేపడతారని, ఆ రెండు రోజులు లాయర్లు విదులకు దూరంగా ఉంటారని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రకటించింది.మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తమ ఆధికారాలను కబళించే ప్రయత్నమే ఆ బిల్లని బీసీఐ ఛైర్మన్‌ మానవ్‌ కుమార్‌ ఆరోపించారు.బీసీఐ రాష్ట్రాల బార్‌ కౌన్సిల్‌ల అధికారాలకు బిల్లు భంగం కలిగించదంటూ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రాసిన లేఖలో వాస్తవం లేదన్నారు.