రేపు పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: రంజాన్‌ చివరి శుక్రవారం సంధర్భంగా రేపు పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. చార్మినార్‌ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్లు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. రేపు ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్‌-మదీనా, చార్మినార్‌-ముర్గీచౌక్‌, చార్మినార్‌-మొఘల్‌ పుర కమాన్‌ రహదారులు మూసివేస్తున్నారు.