రేపు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తాం : కేకే
హైదరాబాద్: ఈనెల 4న నిర్వహించబోయే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని కె. కేశవరావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప.. మండలి, ప్యాకేజీలు ఆమోదయోగ్యం కావని పేర్కొన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ వ్యక్తం చేశారు.