రేవంత్ రెడ్డి రాజకీయాలకు ముందు చిల్లర దొంగ

-అతనికి చరిత్ర లేదు
-సమాచార హక్కు చట్టం అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయల అక్రమార్జన
-ప్రాజెక్టుల పేరిట లక్షల కోటను అక్రమంగా సంపాదించిన కేసీఆర్
– తనను కొనే శక్తి ప్రపంచంలో లేదు
నల్గొండ బ్యూరో.జనం సాక్షి
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయాలకు ముందు ఒక చిల్లర దొంగ అని బిజెపి నాయకుడు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.ఆదివారం
గట్టుపల్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి అసలు చరిత్ర లేదని సమాచార హక్కు చట్టాన్ని ప్రయోగించి వేలాది కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని అన్నారు. టిడిపిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని విపరీతంగా దూషించిన వ్యక్తికి రాష్ట్ర కాంగ్రెస్ పదవి బాధ్యతలు అప్పగించడం దురదృష్టమన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి అని అన్నారు. అధికారంలో ఉన్న తెరాస పార్టీ నేతలకు తను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు. తాను అమ్ముడుపోయి ఉంటే ఎన్నికల్లో ఓటు ఎలా అడుగుతానని ప్రశ్నించారు. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై కొట్లాడినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని, ప్రజల కోసం ఆలోచించే తన రాజీనామా చేసానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అంటే సిరిసిల్ల. సిద్దిపేట మాత్రమే కాదని నల్గొండ జిల్లాలో మునుగోడు కూడా తెలంగాణలో ఉందని తెరాస నేతలకు గుర్తు లేదన్నారు.
ఆనాడు గట్టుపల్ ప్రజలు నన్ను ఆశీర్వదించి 2009లో పార్లమెంట్ కు పంపించారు.
ఏ ఆత్మ గౌరవం కోసం అయితే 60 ఏళ్ళు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామో నేడు అదే ఆత్మ గౌరవం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బంది అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా స్వామ్యం గురించి మాట్లాడే ప్రశ్నించే గొంతులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు.
మునుగోడులో కేసీఆర్ సభ పెడితే 30 వేల మంది వచ్చారు.. అదే బీజేపీ అమిత్ షా బహిరంగ సభ పెడితే 3 లక్షల మంది వచ్చారు.
ఈ సారి పోటీ చేసేది మునుగోడు ప్రజలు గెలిచేది మునుగొడు ప్రజలు నేను నాకిచ్చిన ఎమ్మెల్యే పదవిని మునుగోడు ప్రజలకు ఇచ్చానన్నారు.
మునుగోడు ప్రజలు ఆకలి అయినా తట్టుకుంటాం కానీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే తట్టుకోరని,జరగబోయేది ధర్మ యుద్ధమని భవిష్యత్ తరాలకు వచ్చిన ఎన్నిక అని ఒక్క కుటుంబం నుండి 4 లక్షల మందిని కాపాడే ఎన్నిక గా రాజగోపాల్ రెడ్డి అభివర్ణించారు.ఈ సందర్బంగా గట్టుప్పల మాజీ సర్పంచ్ నామని జగన్నాధం మండలానికి చెందిన పలు పార్టీ నేతలను బీజేపీ పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు