రేషన్‌ బియ్యం పట్టివేత 3 లారీల స్వాధీనం

సుల్తానాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) : ఎలాంటి అనుమతులు లేకుండా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా 3 లారీలను మంగళవారం వ్యవసాయ మార్కెట్‌ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు రెవెన్యూ సిబ్బంది తెలిపిన కథనం ప్రకా రం జిల్లాలోని హుజురాబాద్‌ కేంద్రం నుంచి మహారాష్ట్రలోని గడియాకు మంగళ వారం దర్జాగా మూడు లారీల బియ్యాన్ని తరలిస్తుండగా సుల్తానాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ చెక్‌పోస్ట్‌ సిబ్బంది లారీలను ఆపేందుకు ప్రయత్నించగా లారీ డ్రైవర్లు ఆపకుండా తీసుకవెళ్లడంతో మార్కెట్‌ సిబ్బంది ద్విచక్రవాహనంపై వెంబడించి సుగ్లాంపల్లి వద్ద లారీలను పట్టుకున్నారు. వెంటనే స్థానిక రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. తహశీల్దార్‌ పులిమధుసుదన్‌, ఆర్‌ఐ కిరణ్‌కుమార్‌, రవీందర్‌లు పంచనామ నివేదిక తయారుచేసారు. లారీనెంబర్‌ ఏపీ19 హెచ్‌ఏ 1176లో 435 బస్తాలు, 36 హెచ్‌ 1008 లారీలో 350 బస్తాలు, సీజీ 04 జే 6443 నెంబర్‌లో గల లారీలో 355 బస్తాలు ఉన్నట్లు వారు తెలిపారు. రెండు రోజుల క్రితం హుజురా బాద్‌లో నాలుగు లారీలు పట్టుకున్న సంఘటన మరవకముందే సుల్తానాబాద్‌లో 3 లారీలను లభ్యమయ్యాయి. పెద్దఎత్తున ఈ అక్రమరవాణనకు గురవుతున్నట్లు తెలు స్తుంది. అయితే ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకోవడం కొరకు  అధికారులు సమగ్ర విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేస్తున్నామని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. లారీని పట్టుకున్న జూపాక కుమారస్వామి, సలీంను అధికారు లు అభినందించారు. ఈవిచారణలో తహసీల్దార్‌ మధుసుధన్‌, వ్యవసాయ మార్కెట్‌ అధికారి వెంకటరెడ్డి, ఎస్సై జగదీశ్‌, ఆర్‌ఐ కిరణ్‌కుమార్‌, వీఆర్వో రవీందర్‌లు పాల్గొన్నారు.