రైతులు ఈ కేవైసీ చేయించాలి

ఎంపీటీసీ మస్రత్ సయ్యద్ఆదిల్ అహ్మద్
 పరిగి రూరల్ , సెప్టెంబర్ 23 ( జనం సాక్షి ) :
 రైతులు ఈ కేవైసీ చేసుకుంటేనే
పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులు  రైతుల ఖాతాలలో జమ అవుతాయని   మన్నెగూడ ఎంపీటీసీ, పూడూరు మండలం మైనార్టీ నాయకులు, ఆదిల్ గ్రూప్స్ చైర్మన్  మస్రత్  సయ్యద్ ఆదిల్ అహ్మద్ సూచించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నె గూడలో శుక్రవారం పిఎం కిసాన్ సమ్మాన్ కు డబ్బుల విషయమై రైతులతో, వ్యవసాయ అధికారి రాంబాబుతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎంపీటీసీ మస్రత్  సయ్యద్ అదిల్ అహ్మద్ మాట్లాడుతూ  ఇప్పటివరకు సీఎం కిసాన్ కింద 11 విడతలుగా రైతులకు డబ్బులు జమ చేయబడ్డాయన్నారు.
ఈసారి డబ్బులు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ ( ఆధార్ తో అనుసంధానం) చేయాలని రైతులకు సూచించారు. త్వరలో 12వ విడత పిఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయన్నారు.
 ఈ కార్యక్రమంలో ఏఈఓ రాంబాబు, రైతులు పాల్గొన్నారు.
 ఫోటో రైట్ అప్ :
23పి ఆర్ జి 01 లో ఈ కేవైసీ చేసుకోవాల్సిన రైతుల జాబితాను చూపిస్తున్న ఎంపీటీసీ ఆదిల్ అహ్మద్,  ఏఈఓ రాంబాబు
Attachments area