రైతులు మోసపోకుండా చర్యలు

అనంతపురం,మార్చి25  : రైతులు మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలక్టాన్రిక్‌ వేయింగ్‌ మిషన్లు, తేమ శాతం కొలిచే పరికరాలను  సిద్ధంగా ఉంచాలని జెసి ఆదేశాల మేరకు చర్యు తీసుకుంటామని  మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ బాలభాస్కర్‌ అన్నారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా మొక్కజొన్న క్వింటాకు రూ.1310లతో మద్దతు ధరను ప్రభుత్వం కల్పించనుందన్నారు. జిల్లాలో మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించటం కోసం అధికారులతో జెసి సవిూక్షించారు.  ఈ మేరకు  త్వరలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో తాడిపత్రి, కణెళికల్లు, హిందూపురం ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.  తాడిపత్రి, కణెళికల్లులో ఈనెల 29న కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జెసి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో దళారుల ప్రమేయం ఉండరాదన్నారు. రైతులు వీఆర్వో, ఆర్‌ఐ, తహసీల్దార్ల నుంచి మొక్కజొన్న పంట ధ్రువీకరణపత్రం, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ నంబరు విడిగా తీసుకు రావాలన్నారు. సరకు నిల్వ చేయడానికి తగిన వసతి, గోదాములు ముందుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.  ఈ మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు.