రైతుల రుణమాఫీ హామీ మరిచారా

 

 

 

 

 

●● ధరణి పోర్టల్ ను రద్దు చేయాలి

●●●● భాజపా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రైతు దీక్ష

●●● తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత

మానకొండూరు, ఆర్ సి , మార్చి 10( జనం సాక్షి)

ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని, అన్నదాతల లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ మానకొండూరు మండల కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు అడప రవి అధ్యక్షతన జరిగిన రైతు దీక్ష కార్యక్రమంలో భాజపా నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమానికి భాజపా జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, మండలాధ్యక్షులు రాపాక ప్రవీణ్ హాజరై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలు నిరాటకంగా అందిస్తున్నామని భారాస ప్రభుత్వం చెబుతున్న, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదన్నారు. వేళా పాల లేకుండా కోతలు విధిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని, రైతన్నలకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి వడ్డీతో సహా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ పరికరాలకు సబ్సిడీని కొనసాగించాలని కోరారు. తహసీల్దార్ లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న భారాస ప్రభుత్వాన్ని గద్దె దించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రావుల శంకరాచారి,దూలం కిరణ్ గౌడ్ కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి బోళ్ల శ్రీరాములు, కార్యవర్గ సభ్యులు బొమ్మరవేని మల్లయ్య,ఎస్టి మోర్చా జిల్లా కార్యదర్శి మొగిలి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి సోన్నాకుల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు కందిరాజి రెడ్డి, కత్తి ప్రభాకర్ గౌడ్, దుర్గం శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం మండలాధ్యక్షులు భాషబోయిన ప్రదీప్ యాదవ్, కిసాన్ మోర్చా ఈస్ట్ జోన్ అధ్యక్షులు మాచర్ల కోటేశ్వర్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గాడిచర్ల భూమయ్య, కార్యదర్శి పిన్నింటి రాజేందర్ రెడ్డి, నాయకులు గట్టు మల్లేష్, మీరల శ్రీనివాస్, మాడ సారీ రెడ్డి, కొత్తి రెడ్డి గణపతి రెడ్డి, అనిల్ తదితరులు రైతు దీక్షలో పాల్గొన్నారు.