రైతు బజార్లలో రూ.27కే కిలో బియ్యం

కాజీపేట్‌:వరంగల్‌ నగరంలో రైతు బజార్లలో రూ.27కే కిలో స్వర్ణమసూరి బియ్యం అందించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు.నూతనంగా పదవీ బాద్యతల స్వీకరించిన జాయింట్‌ కలెక్టర్‌ ప్రద్యుమ్న వీటిని ఆదివారం ఉదయం ప్రారంభించారు.వరంగల్‌ ఉర్సు పోచమ్మ మైదాన్‌,ఎక్సైజ్‌ కాలనీ ఫాతిమానగర్‌లలో వీటిని ప్రారంభించారు.జిల్లాలో మొత్తం 15 కౌంటర్లను ఏర్పాటు చేయరున్నట్లు జేసీ తెలిపారు.ఈ కార్యక్రమంలో తాసీల్దార్‌ సంజీవ,మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అద్యక్షుడు సంపత్‌రావు,మిల్లర్‌ పెద్ది వెంకట నారాయణగౌడ్‌ పాల్గొన్నారు.