రైల్వే చార్జీలకు సేవా పన్ను మినహాయింపు

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కేంద్రం కాస్త ఉపశమనం కలిగించింది. ఏసీ రైలు ప్రయాణం సరకు రవాణాలను సేవా పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ రైల్వేకు వర్తమానం పంపింది. ఈ మినహాయింపు సెప్టెంబర్‌ 30వరకు ఉంటుందని ప్రయాణికులు తప్పించుకున్నట్లయింది. రైల్వే లాభదాయక సంస్థ కాదని, సామాజిక సేవా దృక్పథంతో పనిచేసూఉ్తన్న దీని సేవలపై పన్ను వేయడం తగదని రైల్వే మంత్రి ముకుల్‌రాయ్‌ ఆర్థికశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ప్రధాని మన్మోహన్‌కు విజ్ఞప్తి చేసినట్లు రౌల్వే శాఖ వెల్లడించింది. సాధారణ ప్రజలు ప్రయాణించే ఈ రవాణా సంస్థ నిత్యావసర వస్తువులను కూడా చేరవేస్తోందని, దీనిపై సేవాపన్ను వేస్తే తీవ్రపరిణామాలు తలెత్తుతాయని ప్రధానికి వివరించినట్లు తెలిపింది. సేవా పన్ను విధించడం వల్ల ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదముందన్న రైల్వేలపై సేవా పన్ను విధించాలని 2009-10బడ్జెట్‌లోనే నిర్ణయించినా..అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించడంతో నిలిపివేశారు. అప్పటి నుంచి మినహాయింపును పొడిగిస్తూ వస్తున్నారు.