రైల్వే స్టేషన్లకు ఆదర్శ హోదా

సికింద్రాబాద్‌: రాష్ట్రంలోని ఆరు రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే బోర్డు నిర్ణయించింది. తాజా ఎంపికతో ఆదర్శ స్టేషన్ల సంఖ్య 976కు చేరుకొంది. ఎంపిక చేసిన స్టేషన్లలో విశాఖ జిల్లా దువ్వాడ, గుంటూరు జిల్లా మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, కృష్ణా జిల్లా మచీలీపట్నం స్టేషన్లు ఉన్నాయి. 2011లో రాష్ట్రంలోని ఘన్‌పూర్‌, గుంటూరు, జమ్మికుంట, జనగాం, కామారెడ్డి, కరీంనగర్‌, మల్కాజిగిరి, రఘునాధపల్లి స్టేషన్లకు ఈ ప్రతిపత్తి దక్కింది. సాధారణంగా ఆదర్శ స్టేషన్లుగా ఎంపిక చేసిన వాటికి అదనపు సదుపాయాలను కల్పిస్తారు. ప్లాట్‌ఫారాల విసతరణ, ప్రాంగణ అభివృద్ధి, బుకింగ్‌ కార్యాలయం, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌లు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.