రోటరీ క్లబ్ ఇన్నర్ విల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ..
భువనగిరి టౌన్ (జనం సాక్షి ):—–రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి మరియు ఇన్నర్ విల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా మహిళల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది పాప్ మేర్ మరియు మోమగ్రఫీ మహిళలకు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పైల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఎన్నబోయిన ఆంజనేయులు చైర్మన్ గూడూరు నారాయణరెడ్డి సి డబ్ల్యూ సి చైర్మన్ బండారు జయశ్రీ రోటరీ క్లబ్ అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు కార్యదర్శి కరిపే నర్సింగరావు ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు లావణ్య కార్యదర్శి జ్యోతి డాక్టర్ ఆశ్లేశ డాక్టర్ ఇందిరా మల్లారెడ్డి మెడికల్ కాలేజీ వైద్య బృందం పాల్గొన్నారు 150 మందిని పరీక్షించి మందులు పంపిణీ చేశారు 5000 వరకు అయ్యే టెస్ట్లను ఈ శిబిరంలో ఉచితంగా చేయడం జరిగింది.