రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
గంట్యాడ : విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోరని తామరపల్లి కూడలిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శివరాత్రి సందర్భంగా విజయనగరం నుంచి ఎన్‌కోట పుణ్యగిరికి ద్విచక్రవాహనం పై వెళ్తున్న ముగ్గురు ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీకొని అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో విజయనగరం పట్టణానికి చెందిన తుంగాని కిరణ్‌కుమార్ (20), వంగమూడి నారాయణరావు (20) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయ పడిన మరొకరిని విజయనగరం ఆసుపత్రికి తరలించారు.