రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని ఆదుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పరి ప్రసాద్
వికారాబాద్ రూరల్ మార్చి 11 జనం సాక్షి
రోడ్డు ప్రమాద దంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆదుకుంటానని ముందుకు వచ్చిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఉప్పరి ప్రసాద్ భరోసా ఇచ్చారు శనివారం
వికారాబాద్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో క్యాసారం నవాజ్ రెడ్డి అనే వ్యక్తి బస్సు యాక్సిడెంట్ వలన చనిపోయినాడు అట్టి కుటుంబాన్ని వైయస్సార్ తెలంగాణ పార్టీ వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పరి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి ఆర్థిక సాయం చేసి రెండు నెల వరకు రేషన్ ఇప్పిస్తానని మరియు వచ్చే సంవత్సరం స్కూల్ వారికి కావాల్సిన బుక్కులు బట్టలు ఇప్పిస్తానని వారి కుటుంబానికి ధైర్యం చెప్పి పరామర్శించి రావడం జరిగింది ఎర్రవల్లి వైయస్సార్ కమిటీ అధ్యక్షులు సురేందర్ ఇక్బాల్ రామచందర్ మరియు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు రజిని లీగల్ సెల్ అడ్వైజర్ బందయ్య సుకుమార్ నర్సింలు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది