రోడ్డు స్థలం కబ్జా

 

* రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు

* ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని డిమాండ్

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 16 :- రోడ్డు స్థలాన్ని కబ్జా చేస్తూ ఏదేచ్ఛగా అక్రమ నిర్మాణం చేపడుతున్న విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటి…? గత నాలుగు నెలల క్రితం ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసే ఉద్దేశంతో తాత్కాలికంగా ఒక డబ్బాను ఏర్పాటు చేసినప్పుడు ఆ డబ్బాను తొలగించి కోట్లు విలువ చేసే ఎంతో విలువైన ఈ స్థలం రోడ్డు స్థలంతో పాటు ప్రభుత్వ స్థలంగా గుర్తించి ఈ స్థలాన్ని పరిరక్షించేందుకు కృషిచేసిన రెవెన్యూ యంత్రాంగం నేడు డబ్బుతో పాటు ఏకంగా రెవెన్యూ కార్యాలయం ముందే రోడ్డు స్థలంలో రోడ్డును మూసివేస్తూ నిర్మాణమే చేపడుతుంటే నాడు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డబ్బను తొలగించిన రెవెన్యూ యంత్రాంగం నేడు డబ్బతో పాటు రోడ్డు స్థలంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు సుముఖత చూపకుండా రెవెన్యూ అధికారులు చేతులు ముడుచుకుని చోద్యం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటి…? మామూళ్ల మహత్యమా…? అధికారుల నిర్లక్ష్యమా …? అక్రమార్కుల దుస్సాహసమా…? అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రధాన రహదారి పక్కన ఉన్న విలువైన స్థలం ప్రభుత్వ స్థలం కాదా ఈ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసే యత్నంలో భాగంగానే వెనుక రోడ్డును మూసి వేస్తూ చేస్తున్న అక్రమ నిర్మాణం పై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడం అధికారులు కాసులకు కక్కుర్తి పడి విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అనడానికి రోడ్డుకు అడ్డంగా నిర్మాణం అవుతున్న ఈ అక్రమ నిర్మాణం నిలువెత్తు నిదర్శనం కాదా …? అనే విమర్శలు పెద్ద మొత్తంలో ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వ భూములను పరిరక్షించడమే ఏకైక లక్ష్యంగా విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ యంత్రాంగం ప్రధాన రహదారికి పక్కన రెవెన్యూ కార్యాలయానికి ముందరనే ఉన్న ఎంతో విలువైన ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించడంతో పాటు రోడ్డును కబ్జా చేస్తూ అక్రమ మార్గంలో నిర్మాణం చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని తొలగించి చట్టానికి సవాల్ విసురుతూ చట్టవిరుద్ధంగా నిర్మాణం చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు