లంభోదరుని పూజలో పాల్గొన్న వడ్డెపల్లి రాజేశ్వర రావు

అన్ని దానలకన్నా… అన్నదానం మిన్న
*గణేశ ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తాయి

కూకట్ పల్లి
(జనంసాక్షి ):వినాయక చవితి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ లో టిఆర్ఎస్ నాయకుడు శివరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, టీటీడీ బోర్డు మెంబర్ వడ్డేపల్లి రాజేశ్వరరావు లు హాజరై వినాయకుడిని దర్శించుకుని పూజలు చేశారు.అనంతరం అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతు అన్ని దానాల కన్నా…అన్నదానం మిన్న..
అన్నం పరబ్రమ్మ స్వరూపం అని ఆ గణనతుని కృపతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని అన్నారు.అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న’ పరబ్రహ్మ స్వరూపం గా భావించే ఆహారాన్ని భక్తులకు అందించి ఆ భగవంతుని కృపకు పాత్రులు కాగలరని భావిస్తూ గణనాధుని సేవ చేసుకుంటున్నాము అన్నారు. భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజన ప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశీనాథ్ యాదవ్, పోశెట్టి గౌడ్,సంతోష్, తెల్ల హరి కృష్ణ, నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.