లగడపాటి నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
జగ్గయ్యపేట : సమైక్యాంధ్రకు చంద్రబాబు మద్దతు తెలపాలని కోరుతూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కనువిప్పుయాత్రకు సిద్ధమవడంతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈఉదయం అనుమంచిపల్లిలోని లగడపాటి బస చేసిన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్కడికి వస్తున్న ఆయన అనుచరులు, కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుటున్నారు. మరోవైపు పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఇంట్లోనే ఉండి లగడపాటి తలుపులు వేసుకున్నారు.