లస్మన్నపల్లిలో నట్టల మందు పంపిణీ
సైదాపూర్ జనం సాక్షి :ఫిబ్రవరి27 మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో గొర్రెలకు ,మేకలకు సర్పంచ్ కాయిత రాములు సోమవారం నట్టల మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం గొర్ల, మేకల కాపరుల సంక్షేమం కోసం పూర్తి సబ్సిడీతో నట్టల మందును పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని గొర్రెల, మేకల పెంపకం దారులు సద్వినియోగం చేసుకొని వైద్య సిబ్బందిచే నట్టల మందును గొర్రెలకు మేకలకు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి విజయేందర్ రెడ్డి, సిబ్బంది సమ్మిరెడ్డి ,వార్డు సభ్యులు రేగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.