లింగమంతుల స్వామి గట్టుపై ఘనంగా జెడ్పిటిసి పుట్టినరోజు వేడుక
హుజూర్ నగర్ మార్చి 6 (జనంసాక్షి): మండలంలోని అమరవరం లింగమంతుల స్వామి గట్టుపై హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి జన్మదిన వేడుకను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఈ సందర్భంగా శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి రజిత దంపతుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి సైదిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరవరం గ్రామ సర్పంచ్ సుజాత అంజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.