లీకుల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి

.లీకుల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డిరాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 4. (జనంసాక్షి). టీఎస్పీఎస్సీ తోపాటు టెన్త్ పరీక్షల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులతో కలిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి భారీ నోటిఫికేషన్లు ఇచ్చామని కేటీఆర్ చెబుతున్నారని పేపర్ లీకేజీలు తప్ప పరీక్షలు జరిగిన పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీ ల వ్యవహారంతో తెలంగాణ రాష్ట్రంలోని 35 లక్షల కుటుంబాలు ఆగమయితున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కంప్యూటర్లు కొనుగోలు విషయం కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతూ కేసులు పెడుతున్నారని అన్నారు. లీకుల వ్యవహారంలో కేటీఆర్ పై అనుమానాలు ఉన్నాయని ఈ విషయంలో సిట్టింగ్ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరు బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సుర దేవరాజు, షేక్ రియాజ్, నాయకులు పాల్గొన్నారు.