లీకేజ్ కింగ్ బండికి భారీ పనిష్మెంట్ ఇవ్వాలి
బిజెపి చౌకబారు రాజకీయాలు మానుకోవాలి
ఎమ్మెల్యే భాస్కరరావు హితవు
మిర్యాలగూడ, జనం సాక్షి
పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజీ కింగ్ బండి సంజయ్ కి భారీ పనిష్మెంట్ ఇవ్వాలని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయ సింహారెడ్డిలు డిమాండ్ చేశారు. ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎదుగుదలను ఉరవలేని బిజెపి నేతలు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని, పదో తరగతి విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తప్పులు చేసేది వారే అయినప్పటికీ, తప్పులను తమ ప్రభుత్వంపై ఆపాదించడం సరైంది కాదన్నారు. దమ్ముంటే ఎదురుగా పార్టీని ఎదుర్కోవాలి కానీ, ఇలా నిరుద్యోగులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కృష్ణ పత్రం లీకేజీ విషయంలో బిజెపికి సంబంధం ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులను ఇద్దరిని ప్రభుత్వం తొలగిస్తే బిజెపి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ అన్నిటికి బండి సంజయ్ ను ప్రధాన భాద్యుడిగా భావించి అతడిని తొలగించాలని, చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బారసా గా కేంద్ర పార్టీని ఏర్పాటు చేసిన నాటినుండి దేశవ్యాప్తంగా బారసా కు పెరుగుతున్న ప్రాధాన్యతను తట్టుకోలేని బిజెపి నేతలు ఇలాంటి చౌకబారు ప్రయత్నాలు పాల్పడుతున్నారని ఇది శోచనీయమైన విషయమని అన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎంపీపీ నూకల సరళ హనుమత్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ఎండీ యూసఫ్, లు పాల్గొన్నారు.