లేఆఫ్‌ ఉపసంహరణ

విజయనగరం: జిల్లాలోని గరివిడి ఫేకర్‌ పరిశ్రమలో లేఆఫ్‌ను యాజమాన్యం ఉపసంహరించింది. ఈ మేరకు ఫేకర్‌ జనరల్‌ మేనేజర్‌ ఏవీఎస్‌ఎన్‌ మూర్తి నోటీసు బోర్డులో ప్రకటన ఉంచారు. ఫేకర్‌ పరిశ్రమలో పనిచేస్తున్న 494 మంది శాశ్వత కార్మికులకు, మరో వెయ్యి మంది ఒప్పంద కార్మికులకు వర్తిస్తుందని తెలిపారు. విద్యుత్‌కోతలు ఒప్పంద కార్మికుల సమ్మె మూలంగా ఫేకర్‌ పరిశ్రమ నిర్వహణ కష్టసాధ్యం కావడంలో లేఆఫ్‌ను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిచూసి కార్మికులు వెంటనే ఆందోళనకు దిగారు. యాజమాన్యం వారి ఆందోళన గమనించి కార్మికులతో మట్లాడింది. చివరకు లేఆఫ్‌ను ఎత్తివేస్తున్నట్లు సాయంత్రం ప్రకటించింది.