లోకేశ్‌కు బాద్యతలు అప్పగించాలి తెలుగు యువత డిమాండ్‌

హైదరాబాద్‌: నారా లోకేశ్‌కు రాష్ట్ర తెలుగు యువత బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేస్తోంది.పార్టీలోకి యువరక్తం కావాలని అభిప్రాయ పడుతున్న తెలుగు యువత నేతలే ఈ మేరకు అధినేత చంద్రబాబుకు ఓ వినతిత్రం అందించారు.లోకేశ్‌ పార్టీలోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా రాష్ట్ర యువతకు సంకేతం వెళ్లుందని యువతను పార్టీవైపు అకర్షించేందుకు అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా లోకేశ్‌తో విస్తృతంగా పర్యటనలు చేయించాలని చంద్రబాబుని కోరారు.