వచ్చేవారం ప్రధానితో భేటీ కానున్న దీదీ
రాష్టాన్రికి సంబంధించి సమస్యలపై చర్చించే అవకాశం
న్యూఢల్లీి,నవంబర్16(జనం సాక్షి ): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చే వారం ఢల్లీిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉందని, రాష్టాన్రికి రావాల్సిన బకాయిలు, బీఎస్ఎఫ్ అధికార పరిధి పెంచడం వంటి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ఈ నెల 22న ఢల్లీికి వెళ్లి, మళ్లీ 25న తిరిగి కోల్‌కతాకు వస్తారని చెప్పాయి. ఈ సందర్భంగా ఆమె ఇతర రాజకీయ పార్టీల నేతలతోనూ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలిపాయి. ప్రధానితో భేటీ సందర్భంలో బెంగాల్‌కు రావాల్సిన జీఎస్టీ బకాయిలు విడుదల చేసేలా పీఎంపై ఒత్తిడి తెస్తారన్నారు. అలాగే ఇటీవల బీఎస్ఎఫ్ అధికార పరిధి పెంచేలనే నిర్ణయంపై అభ్యంతరాలు లేవనెత్తుతారన్నారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోవిూటర్ల నుంచి 50 కిలోవిూటర్ల పరిధిని పెంచుతూ కేంద్రం బీఎస్ఎఫ్కు అధికారం ఇచ్చింది. ఇప్పటికే దీనిపై మమత అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం చర్యలు ’సామాన్య ప్రజలను హింసించడమే’ అన్న ఆమె.. ఈ అంశంపై అభ్యరంతరాలు లేవనెత్తుతూ ప్రధానికి లేఖ సైతం రాశారు.