వనస్థలిపురం ఎన్‌బీఐలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:వనస్థలపురం ఎన్‌బీఐలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.విద్యుదాఘతంతో బాంక్‌లో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి.ఏసీ కంప్యూటర్లు నగదు లెక్కింపు పర్నిచర్‌ పూర్తిగా దగ్దమయ్యాయి.ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు ఎన్‌బీఐ అధికారులు తెలిపారు.ఖాతాదారుల లాకర్లు ఇతర పత్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు.