వన్నెల్ బి మున్నూరు కాపు సంఘం ప్రొసీడింగ్ కాపీ అందజేసిన ఉపా సర్పంచ్ కిషన్, బిఆర్ఎస్

 నాయకులువన్నెల్ బి మున్నూరు కాపు సంఘం ప్రొసీడింగ్ కాపీ అందజేసిన ఉపా సర్పంచ్ కిషన్, బిఆర్ఎస్ నాయకులుబాల్కొండ మార్చ్ 30(జనం సాక్షి ) బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామం లొ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మున్నూరు కాపు కుల సంఘా భవనా నిర్మాణానికి  ఉప సర్పంచ్ నాగుల పల్లి కిషన్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శ్రీకాంత్ చారి మున్నూరు కాపు సంఘా అధ్యక్షుడు ఆనంతుల చిన్నయ్య,ఉపా అధ్యక్షుడు ఆవుర్గ రవి ప్రతినిధులకు ప్రొసీడింగ్ కాపీ అందజేశారు ఈ సందర్భంగా  3.5 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు.గ్రామాల అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల ప్రజలకు కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని గ్రామ అధ్యక్షుడు శ్రీకాంత్ చారి తెలిపారు.మున్నూరు కాపు సంఘం నాయకులు మంజూరు కృషి చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు,ఈకార్యక్రమంలో  నాగులపల్లి కిషన్,ఎంపీటీసీ గంగసరం భోజరెడ్డి ,రైతుబంధు మండల కో ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్,గ్రామ శాఖ అధ్యక్షుడు కోటగిరి శ్రీకాంత్ చారి, బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.