వరంగల్‌లో అంతరాష్ట్ర ముఠా అరెస్టు

వరంగల్‌: మోసాలకు పాల్పడే ఆరుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.16 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు సభ్యుల ముఠా అసలునోట్లు తీసుకొని నకిలీ కరెన్సీ అంటగడుతూ వివిధ రకాల మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వీరిపై 9 జిల్లాల్లో  34 కేసులు నమోదైనట్లు చెప్పారు.