వరి పొలాలలో అగ్గి తెగులు నివారణ తగు సూచనలు మండల వ్యవసాయ అధికారి సతీష్

 

మహా ముత్తారం మార్చి 14 (జనం సాక్షి) రైతులు వేసిన వరి పొలాలలో మండల వ్యవసాయ అధికారి సతీష్ నేరుగా అక్కడికి వెళ్లి అగ్గి తెగులను ఆయన పరిశీలించారు. మంగళవారం మండలంలోని కేశపూర్ నిమ్మగూడెం రైతులు వరి పొలాలలో అగ్గి తెగులను నివారణ పద్ధతులను రైతులకు సూచనలు చేశారు. ఈ తెగులు సోకినప్పుడు ఆకులపై మచ్చలు ఏర్పడి అన్ని ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోయి దూరం నుండి చూస్తే అగ్నిపిచ్చినట్టుగా కనిపిస్తాయి తెలిపారు.
ఆకుల పరిస్థితులు, :- నత్రజని సంబంధిత యూరియా అమూల్య వంటి ఎరువులను అధికంగా వాడటం, మబ్బులతో కూడిన వాతావరణం జల్లులు పడడం పొలంలో మరియు పొలం గట్ల పైన గడ్డి జాతి కల్ప మొక్కలు ఉండటం వలన అగ్గి తెగులు వస్తాయని తెలిపారు.
నివారణ చర్యలు:- నివారణకు డ్రై క్లోసింగ్0.6 గ్రామ్ లేదా పోదామొలిన్1.5 మిల్లీలీటర్ లేదా కాసుగా మైసిన్ 2.5 మిల్లీలీటర్, నీటికి చొప్పున పిచికారి చేయాలి. యూరియా ఎరువులను ఈ సమయంలో వాడాలి. తెగుళ్లు తగ్గుముఖం పట్టిన తర్వాత యూరియా లేదా అమోనియా ఎరువులను మోతాదులో వాడాలని రైతులకు తగు సూచనలు వారు తెలియజేశారు.