వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్లు స్థలాలు మంజూరు చేయాలి


మల్దకల్ మార్చి 2 (జనంసాక్షి) మల్దకల్ మండల వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని గురువారం మల్దకల్ తాసిల్దార్ హరికృష్ణకు,ఎంపిపి రాజారెడ్డి కు వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు.మల్దకల్ మండలంలో వివిధ దినపత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న ఇల్లు స్థలాలు లేకపోవడం పట్ల తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయనివారు తెలిపారు.గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు డబుల్ బెడ్ రూమ్ అందజేస్తామని తెలిపిన విషయం ప్రకారం ప్రభుత్వము నుండి ఇళ్ల స్థలాలు మంజూరు చేయించి జర్నలిస్టులను ఆదుకోవాలని వారు కోరారు. ఇళ్ల స్థలాలు కేటాయించడంతోపాటు ఇంటి నిర్మాణానికి తగు ఆర్థిక సహాయం అందేలా జిల్లా కలెక్టర్ తో చర్చించి సమస్యలు పరిష్కరించాలని వారు ఆ వినతి పత్రంలో కోరారు.ఇందుకు స్పందించిన తాసిల్దార్ జర్నలిస్టుల ఇళ్లస్థలాలకై జిల్లా కలెక్టర్ తో చర్చించి స్థలాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మల్దకల్ మండల వర్కింగ్ జర్నలిస్టుల సంఘం గౌరవ అధ్యక్షుడు వీరయ్య,సలహాదారు ముకుందరావు,అధ్యక్షుడు శ్రీనివాసులు,ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్,జర్నలిస్ట్ సంఘం సభ్యులు దామలక్ష్మీనారాయణ,గోవర్ధన్ గౌడ్,శ్యాంసుందర్,మురళీధర్ గౌడ్, భీమరాయుడు,ఎన్. వెంకటేష్,మనోహర్,సత్యన్న, ఓబులేసు,నవీన్ కుమార్ రెడ్డి, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.