వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో యూనియన్లకు అతీతంగా ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందించిన జర్నలిస్టులు

గద్వాల ఆర్ సి (జనంసాక్షి) మార్చి1 జోగులాంబ గద్వాల జిల్లా లో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ లకు  ఇళ్ల స్థలాలు కేటాయించాలని జర్నలిస్టుల ఆధ్వర్యంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి వినతిపత్రం సమర్పించారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారు ఇతర ప్రాంతాలలో ఏ  విధంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నారో అదే విధంగా మన ప్రాంతంలో పనిచేసే జర్నలిస్టులకు కూడా త్వరలో ప్రభుత్వ స్థలం  కేటాయించి వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టులకు  ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారుఈ కార్యక్రమంలో  ప్రింట్ & ఎలక్ట్రానిక్  మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు  పాల్గొన్నారు.