వర్గీకరణకు నేను వ్యతిరేకం: ప్రకాశ్ అంబేద్కర్
రాజమండ్రి: వర్గీకరణకు తాను వ్యతిరేకమని రాజ్యాంగనిర్మాత అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తెలియజేశారు. ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వంతో చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. రిజర్వేషన్ ఫలాలు అనుభవించినవారు, అనుభవించని వారు అంటూ రెండు వర్గాలుగా విభజించాలని ఆయన చెప్పారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన వేమగిరిలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.