వర్షం పడితే సీసీ రోడ్డు చెరువే.

. ! జనం సాక్షి , కమాన్ పూర్ : అధికారుల పర్యవేక్షణ లోపానికి.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ సిమెంట్ రోడ్డు..!. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రం పరిధిలోని కమాన్ పూర్ క్రాస్ రోడ్ బాపూజీనగర్ లో ఐచర్ ట్రాక్టర్ స్పేర్స్ పార్ట్స్ షోరూమ్ ఎదురుగా ఉన్న వీధిలో గత కొంత కాలం క్రితం సిమెంట్ రోడ్డు వేశారు. అయితే ఈ సిమెంట్ రోడ్డు మొదట, చివర్లో ఎత్తుగా వేయడం మధ్యలో వంపుగా ఉండడంతో చిన్న వర్షం పడ్డ ఈ సిమెంట్ రోడ్డుపై నీరు భారీగా నిలిచిపోయి చెరువును తలపిస్తోంది. రోడ్డుపై నీరు నిలిచి ఉండడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నదని స్థానిక ఎంపీటీసీ బోనాల వెంకటస్వామి తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి నెలకొందని, దీని నుండి విముక్తి కలిగించి శాశ్వత పరిష్కారం చూపాలని మండల స్పెషల్ ఆఫీసర్ దృష్టికి శుక్రవారం తీసుకు వెళ్లినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.