వస్త్ర వ్యాపారుల రాష్ట్రబంద్
హైదరాబాద్: వస్త్రాలపై విధించిన వ్యాట్ తక్షణమే రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న వ్యాపారులు బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చారు. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యాట్‌పోటుతో వస్త్ర వ్యాపారుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం తాజాగా వస్త్ర వ్యాపారాన్ని సెన్సిటివ్ కమాడిటీన్ చట్టాన్ని అమలు చేయడం హేయమని వస్త్రవ్యాపారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ అన్నారు. వ్యాట్‌తో పాటు కొత్త చట్టాల్ని ఎత్తివేసేలా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలోని 245 రిజిస్టర్ వస్త్ర వ్యాపార సంఘాలతో పాటు ఇతర సంఘాలు బుధవారం బంద్ పాటిస్తున్నట్లు తెలియజేశారు.