వారాసిగూడలో ధూంధాం విజయవంతం

బౌద్దనగర్‌: తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ఛలో హైదరాబాద్‌ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ వారాసిగూడలో తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాం కార్యక్షికమం జయపూపదమైంది. కార్యక్షికమమంలో రసమయి బాలకిషన్‌ బృందం పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్షికమానికి ముఖ్య అతిథులుగా జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం, బీజేపీ నేత దత్తావూతేయ, గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, ఎంబీ కృష్ణ యాదవ్‌, ఎన్‌డీపీ నేత గోవర్దన్‌ పాల్గోన్నారు. కార్యక్షికమంలో  నాయకులు యాదగిరి, పాండు గౌడ్‌, రాచమల్ల కృష్ణామూర్తి, రవిప్రసాద్‌గౌడ్‌, ప్రొఫెసర్‌ భాగయ్య, రైల్వే జేఏసీ ముత్తయ్య, ఉమార్‌ ఖాన్‌, ఆటోశంకరయ్య, రాంచందర్‌, రమేష్‌, ఆవుల బలరాం, సురేష్‌చారి, పీ సంజీవ్‌ ముదిరాజ్‌, ప్రభుగుప్త, వీఎస్‌ రాజు, కంది నారాయణ, ఓములు, గౌరీ గణేశ్‌ ముదిరాజ్‌, వై భాస్కర్‌ పాల్గొన్నారు.