వాస్తవాలు ప్రజలకు తెలిపినందుకే రాహుల్ గాంధీ పై కుట్ర.వాస్తవాలు
ప్రజలకు తెలిపినందుకే రాహుల్ గాంధీ పై కుట్ర.
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్.
సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 1.(జనంసాక్షి) పార్లమెంటు సాక్షిగా మోడీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలిసేలా చేసినందుకే రాహుల్ గాంధీ పై కుట్రపూరితంగా వేటు విధించారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పై కుట్రపూరితంగానే పార్లమెంటులో వేటు విధించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులను దోచుకుపోతున్న మోడీలను ఉద్దేశించి కర్ణాటకలో మాట్లాడితే ఆ విషయంపై గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో కేసు వేసిన వ్యక్తి వెనక్కి తీసుకున్న తిరిగి మళ్లీ అదే కేసులో రాహుల్ గాంధీ పై చర్యలు తీసుకోవడం కుట్రపూరితమైన చర్య అని అన్నారు. ఈ విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చొప్పదండి ప్రకాష్, మైనార్టీ సెల్ నాయకులు షేక్ రియాజ్, నాలుక సత్యం, తదితరులు పాల్గొన్నారు