వాహనదారులకు శుభవార్త!

న్యూఢిల్లీ, జూన్‌ 13 : వాహనదారులకు శుభవార్త… రానున్న రెండు మూడు రోజుల్లో పెట్రోలు లీటరు ధర మరో రెండు రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడయిల్‌ ధరలు తగ్గడంతో చమురు సంస్థలు ఈ నెల 15న సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత నెల 23వ తేదీన లీటరుకు రూ. 7.50 పెంచడం… విపక్షాల ఆందోళన నేపథ్యంలో రెండు రూపాయలు తగ్గించడం… రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ పన్ను శాతం కొద్దిగా తగ్గించడంతో మరో రూ.1.50 మేర తగ్గడం తెలిసిందే.