వికలాంగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి

గుంటూరు: వికలాంగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో  వికలాంగులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. వికలాంగులకు మెరుగైన సహాయం అందించే అంశాన్ని తమ మేనిఫెస్టోలో ప్రవేశ పెడతామని ఆయన హామి ఇచ్చారు.