వికలాంగుల సమస్యలపై బొత్సను కలిసిన మందకృష్ణ

హైదరాబాద్‌: వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి బొత్స సత్యనారాయణను ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. బొత్సను అయన నివాసంలో కలిసిన మందకృష్ణ వికలాంగుల డిమాండ్లకు సంబంధించి వినతిపత్రాన్ని అందజేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఇతర నగరాల్లో వికలాంగుఉలు మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మంత్రి అంగీకరించారని చెప్పారు. మంగళవారం నిజాం కళాశాల మైదానంలో జరగనున్న వికలాంగుల రాజ్యాధికార యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కార్యక్రమాన్ని ఇందిరాపార్కు వద్దకు మార్చినట్లు తెలియజేశారు.