విగ్నేశ్వర విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు.
యాలాల్ సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్.
తాండూరు అగస్టు 31(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల గ్రామంలో ఛత్రపతి శివాజీ వినాయక ఉత్సవ కమిటీ కోరిక మేరకు నూతన శాశ్విత వినాయక మండపానికి యాలాల్ సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్ దంపతులు
పూజా కార్యక్రమాలు నిర్వహించి మండపాన్ని ప్రారంభించారు. అనంతరం విఘ్నేశ్వరుని పూజాకార్యక్రమంలో యాలాల్ సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించాలని లంభోదరన్ని వేడుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు , హైందవ భక్తులు, నాయకులు, గ్రామస్థులు, మహిళలు, యువకులు పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు