విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు , పెన్నులు పంపిణి

బోథ్ మార్చి 31 (జనం సాక్షి)మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, పెన్నులను భరత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పిటిసి సంధ్యారాణి ఎంఈఓ భూమారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగాఎలుకరాజుమాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి చదవి తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలనిఆకాంక్షించారు. రాబోవు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో పాఠశాల నుండి మండల్ టాపర్ గా వచ్చిన విద్యార్థులకు తన వంతుగా 5000 రూపాయలను ప్రోత్సాకర బహుమతిని అందించనున్నట్లు ప్రకటించారు. జడ్పిటిసి సంధ్యారాణి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానంలో నిలవడానికి పదవ తరగతి తొలి మెట్టు అని కాబట్టి విద్యార్థులు అందరూ కష్టపడి చదివి తమ గమ్యాలను చేరుకొని ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో అత్యున్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సంధ్యారాణి ఎంఈఓ భూమారెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లి కిషన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంజీవరెడ్డి బారాస నాయకులు రమణ గౌడ్ లక్ష్మణ్ ఉషన్న ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.