విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించిన బలరాం జాదవ్
బోథ్ (జనంసాక్షి)బోథ్ మండలం మర్లపల్లి గ్రామంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాయడానికి బోథ్ వెళ్ళాల్సిన పరిస్థితి.ఈ అవసరాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర అద్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి రవాణా సౌకర్యం కల్పించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ సౌకర్యం కల్పించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్తులు బలరాంకు ధన్యవాదాలు తెలిపారు.విద్యార్థులందరికీ బలరాం జాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ బొడ్డు గంగాధర్,విడిసి అధ్యక్షులు లాడేవార్ ఎర్రప్ప,ఎక్స్ సర్పంచ్ రాథోడ్ రాము మరియు తదితరులు పాల్గొన్నారు.