విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 3. (జనం సాక్షి).కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో సైన్స్ ప్రయోగాలు ప్రాజెక్టులు వినూత్న ఆవిష్కరణలు చేసిన అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు. శుక్రవారం పాఠశాలల్లో చదువుతున్న సిహెచ్ చక్రధర్(9 వ తరగతి) సిహెచ్ రుతిక(9 వ తరగతి) లను అభినందిస్తూ ఒక్కొక్కరికి 1500 రూపాయలు నగదు పారితోషకం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పరబ్రహ్మ మూర్తి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతనుపెంపొందించడానికి బడిలో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నామని శాస్త్రీయ వైఖరులు పెంపొందించడానికి వినూత్న ఆవిష్కరణ కోసం విద్యార్థుల్లో 30 మందిని ఎంపిక చేసి జూనియర్ సైంటిస్టులుగా వారికి శిక్షణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. వారిలో ఈ ఇద్దరు విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహిస్తూ వారికి నగదు పారితోషికం అందించామని అన్నారు.వీరిని స్ఫూర్తిగా తీసుకొని పాఠశాలలోని విద్యార్థులు ముందుకు వచ్చి వినూత్న ఆవిష్కరణ చేయాలని తద్వారా పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి సైన్స్ ఉపాధ్యాయులు శంకర్ గౌడ్, సరిత మరియు శ్రీహరి పాల్గొన్నారు.