విద్యార్థులు ఉన్నత శిఖరాలు అందుకోవాలి : ఎస్ పి ఆర్ కళాశాల చైర్మన్ నర్సిహ్మ రెడ్డి
: శామీర్ పేట్, జనం సాక్షి :
:ఘనంగా శామీర్పేట ఎస్ పి ఆర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు
శామీర్పేటలోని ఎస్ పి ఆర్ కళాశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని మొగుళ్ళ వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఎస్ పి ఆర్ ఇంటర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు ‘వార్షి కోత్సవ ఉత్సవ్’ సంబరాలను జరుపుకున్నారు. కళాశాల చైర్మన్ నరసింహారెడ్డి జ్యోతి ప్రజ్వళన కావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని చక్కటి విద్యాభ్యాసంతో రాణించాలని సూచించారు. శ్రద్ధతో చదువుకున్న వారు మాత్రమే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆయన వివరించారు. కష్టపడి చదువుకున్న వారికి మంచి ఫలితం ఉంటుందని భవిష్యత్తు బంగారు భవిష్యత్ అవుతుందని తెలిపారు. రాబోయే పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి కళాశాలకు, వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి ఆహుతులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ ఆట పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో షామీర్పేట ఎస్ పి ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.మహేందర్ గౌడ్, లెక్చరర్లు గోవర్ధన్ రెడ్డి, తిరుపతిరావు, మోహన్ రెడ్డి, నరేష్, శ్రీనివాస్, భాస్కర్, కళాశాల విద్యార్థిని విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
10ఎస్పీటీ -2: వార్షికోత్సవ వేడుకల్లో దృశ్యం