విద్యార్థులు మానసిక ఒత్తిడి అధిగమించాలి
మోత్కూరు మార్చి 6 జనంసాక్షి : పదో తరగతి విద్యార్థులు మానసిక ఒత్తిడి తట్టుకొని పరీక్షలు రాయాలని ఎంఈఓ వేపూరి శ్రీధర్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మోత్కూర్ మండల పదో తరగతి విద్యార్థులకు స్థానిక హైస్కూల్ లో వ్యక్తిత్వ వికాస తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో మోటివేటర్ గుండాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. కె. సురేష్ కుమార్ మాట్లాడుతూ పరిక్షా రాయడం లో మెలకువలు నేర్పుతూ విద్యార్థులు భయానికి లోను కాకుండా, చదివిన అంశాలు గుర్తుంచుకొని పరీక్షలు రాయాలని చెప్పారు. సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. అంజయ్య,పాటిమట్ల ప్రధానోపాధ్యాయులు ఏం. అగ్గిరాములు,ఉపాధ్యాయులు రాంప్రసాద్, రాంరెడ్డి, గాదె వెంకటేశ్వర్లు,వెంకటాచారి, వెంకన్న, నిజాం, ప్రవీణ్ కుమార్, అచ్చిరెడ్డి, రవి, ఫరూక్, మంజుల,కవిత తదితరులు పాల్గొన్నారు.